: బాబుకు నోటీసులపై కేసీఆర్ తో ఏసీబీ డీజీ భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో అవినీతి నిరోధక శాఖ డీజీ ఏకే ఖాన్, ఇంటెలిజెన్స్ విభాగాధిపతి శివధర్ రెడ్డి సమావేశమయ్యారు. నోటుకు ఓటు, ఫోన్ ట్యాపింగ్ అంశాలతో రెండు రాష్ట్రాల రాజకీయాలు వేడెక్కిన నేపథ్యంలో కేసీఆర్ తో ఉన్నతాధికారుల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న పరిణామాలపై ప్రధాని, రాష్ట్రపతి, కేంద్ర హోం మంత్రితో చర్చించేందుకు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం చంద్రబాబు, వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఢిల్లీ వెళ్లిన నేపథ్యంలో కేసీఆర్ కూడా హస్తినకు ప్రయాణం కానున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రానికి పూర్తి వివరాలు అందించడం, బాబుకు నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ ఏసీబీ డీజీ ఏకే ఖాన్, తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం అధిపతి శివధర్ రెడ్డిలతో కేసీఆర్ చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.

More Telugu News