: లెగోతో చేతులు కలిపిన యాంగ్రీ బర్డ్స్ సృష్టికర్త
యాంగ్రీ బర్డ్స్... ఈ పేరు తెలియని, ఆట ఆడని స్మార్ట్ ఫోన్ వినియోగదారుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. ఈ గేమ్ ను తయారు చేసింది ఫిన్ లాండ్ కు చెందిన రోవియో సంస్థ. అయితే, ఇటీవలి కాలంలో పెరిగిన పోటీ, త్రీడీ లుక్ గేమ్స్ ప్రాచుర్యం పొందడంతో యాంగ్రీ బర్డ్స్ ఆడేవారి సంఖ్య తగ్గిపోయింది. దీంతో 2014లో రోవియో ఆదాయం ఏకంగా 73 శాతం దిగజారింది. ఆదాయాలు తగ్గడంతో ఉద్యోగుల్లో 110 మందిని (14 శాతం) తొలగించిన రోవియోపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తిరిగి పుంజుకునే దిశగా మరో గేమింగ్ అండ్ టాయ్స్ సంస్థ 'లెగో' రోవియో ఒప్పందం కుదుర్చుకుంది. యాంగ్రీ బర్డ్స్ బ్రాండ్ పేరిట టాయ్స్, కొత్త గేమ్ వర్షన్లు, అపెరల్స్, స్వీట్స్ తదితరాలను తయారు చేసి మార్కెటింగ్ చేసేలా లెగోతో డీల్ కుదిరింది. దీంతో పాటు త్వరలో రానున్న త్రీడీ మూవీతో తిరిగి మార్కెట్లో నిలదొక్కుకుంటామని చెబుతోంది. కాగా, ఇప్పటికీ పెయిడ్ మొబైల్ యాప్స్ లో యాంగ్రీ బర్డ్స్ నెంబర్ వన్.