: తమిళ తీరంలో కోస్ట్ గార్డ్ విమానం మిస్సింగ్... ముమ్మరంగా సాగుతున్న గాలింపు
తమిళనాడు సముద్ర తీరంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ కు చెందిన ఓ విమానం అదృశ్యమైంది. నేటి ఉదయం తీరంపై గస్తీ కోసం నలుగురు సిబ్బందితో నింగికెగసిన కోస్ట్ గార్డ్ విమానం కొద్దిసేపటికే కనిపించకుండా పోయింది. దీంతో అప్రమత్తమైన కోస్ట్ గార్డ్... భారత నావికాదళంతో కలిసి విమానం ఆచూకీ కోసం గాలింపు చేపట్టింది. విమానం అదృశ్యానికి గల కారణాలు తెలియరాలేదు.