: పిజ్జా ఆర్డర్ చేయండి, బాక్స్ నే ప్రొజెక్టర్ చేసుకోండి!


పిజ్జా ఆర్డర్ చేస్తే బాక్స్ ను ప్రొజెక్టర్ గా ఎలా చేసుకుంటాం? అని ఆశ్చర్యపోతున్నారా? అక్కడికే వస్తున్నాం... వ్యాపార సూత్రాలు బాగా వంటబట్టించుకున్న పిజ్జా హట్ సరికొత్త సాంకేతిక సౌకర్యానికి నాంది పలికింది. హాంగ్ కాంగ్ లో పిజ్జాను ఆర్డర్ చేస్తే క్షణాల్లో బాక్సుతో పిజ్జా డెలివరీ బాయ్ ప్రత్యక్షమై పిజ్జా చేతిలో పెడతాడు. పిజ్జా బాక్స్ కు అనుసంధానంగా ఓ చిన్న స్టాండ్, లెన్స్ గ్లాస్ ఇస్తాడు. ఆ స్టాండ్ పై స్మార్ట్ ఫోన్ పెట్టి, బాక్సుకు ఇచ్చిన రంధ్రంలో ఆ లెన్స్ గ్లాస్ అమర్చి, గోడకు ఎదురుగా ఫోన్ లో సినిమా ప్లే చేస్తే గోడపై సినిమా ప్రత్యక్షమవుతుంది. సినిమా చూస్తూ పిజ్జా ఎంజాయ్ చేయవచ్చని పిజ్జా హట్ హామీ ఇస్తోంది. ఈ సరికొత్త ఆవిష్కరణ పిజ్జా హట్ అమ్మకాలు బాగానే పెంచింది.

  • Loading...

More Telugu News