: పిల్లల పెంపకం కోసం తల్లిదండ్రులు రూపొందించిన యాప్


ప్రపంచంలో అత్యంత కష్టమైన, క్లిష్టమైన పని ఏదైనా ఉందంటే అది 'పిల్లల పెంపకమే' అని నిస్సందేహంగా చెప్పవచ్చు. పిల్లల పెంపకంలో ఉన్న సాధకబాధకాలు ఏ తల్లిదండ్రులను అడిగినా చెబుతారు. ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొనేందుకు ఓ యాప్ ను కొంతమంది తల్లిదండ్రులు తయారు చేయడం విశేషం. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో లభ్యమవుతుంది. దీని వల్ల ప్రపంచంలో జరిగే ఎన్నో విషయాలు, విద్యాసంబంధమైన చిక్కు ప్రశ్నలకు పరిష్కారాలు లభ్యమవుతాయి. ఆసక్తికర అంశాలకు సంబంధించిన అంశాలపై చర్చలో పాల్గొనే అవకాశం కూడా లభిస్తుందని యాప్ రూపకర్తలు చెబుతున్నారు. పిల్లలకు ఏవైనా ఫోబియాలు ఉంటే వాటిని పారద్రోలేందుకు చిట్కాలు, సమాచారం కూడా లభిస్తాయి. అలాగే పిల్లలకు రుచికరంగా చేసేందుకు స్నాక్స్, వంటలు వంటివి కూడా అందుబాటులో ఉంటాయని రూపకర్తలు పేర్కొంటున్నారు. మన దగ్గర్లో పిల్లలకు సంబంధించిన ఏవైనా కార్యక్రమాలు జరిగితే వాటికి సంబంధించిన అలెర్ట్స్ కూడా ఈ యాప్ పంపుతుందట. దీంతో ఆయా కార్యక్రమాలకు హాజరై ఆహ్లాదకరంగా గడపవచ్చని వారు వెల్లడించారు.

  • Loading...

More Telugu News