: రేవంత్ రెడ్డికి కోర్టులో చుక్కెదురు

ఏసీబీ కస్టడీలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి చుక్కెదురైంది. కస్టడీలోకి తీసుకున్న రేవంత్ ను ఏసీబీ అధికారులు సిట్ కార్యాలయంలో ఉంచగా, అక్కడ తనకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదని రేవంత్ ఆరోపించారు. తనను చర్లపల్లి జైలుకు తరలించాలని ఆయన కోర్టుకు విన్నవించుకున్నారు. అయితే, ఏసీబీ న్యాయస్థానం రేవంత్ అభ్యర్థనను తోసిపుచ్చింది. రేవంత్ ను సిట్ కార్యాలయంలోనే ఉంచాలని ఆదేశించింది. కాగా, రేవంత్ ఆరోపణలపై సిట్ అడిషనల్ కమిషనర్ స్వాతి లక్రా స్పందించారు. ఆయనకు తగు రీతిలో సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. కొత్త దుప్పట్లు, మినరల్ వాటర్ అందిస్తున్నామని తెలిపారు.

More Telugu News