: స్పైస్ జెట్ విమానానికి పెను ప్రమాదం తప్పింది
స్పైస్ జెట్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. అమృతసర్ విమానాశ్రయంలో స్పెైస్ జెట్ కు చెందిన ఓ విమానం గాల్లోకి లేచేందుకు రన్ వేపైకి వచ్చింది. విమానం ఎగిరిపోతుందనుకుంటున్న చివరి క్షణంలో అకస్మాత్తుగా ఓ ట్రక్ రన్ వే పైకి దూసుకొచ్చింది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయం మధ్య ఉండే రన్ వేపైకి అకస్మాత్తుగా ఒక వాహనం చొచ్చుకు రావడంపై ఎయిర్ ఫోర్స్ సిబ్బంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది మధ్య వివాదం రేగింది. రెడ్ సిగ్నల్ ఉన్నప్పటికీ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ట్రక్ రన్ వేపైకి దూసుకొచ్చిందని ఎటీసీ ఆరోపిస్తోంది. కాగా, పెను ప్రమాదం తప్పించుకున్న ప్రయాణికులు హాయిగా ఊపిరిపీలుస్తూ, సిబ్బంది నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు.