: సల్మా సెక్స్ రాకెట్ వెనుక బడాబాబులు: డీఎస్పీ వెంకటరామాంజనేయులు
అనంతపురం జిల్లా కదిరిలో సంచలనం సృష్టించిన న్యూస్ యాంకర్ సల్మా సెక్స్ రాకెట్ వెనుక బడాబాబుల హస్తముందని అనుమానిస్తున్నట్టు డీఎస్పీ వెంకటరామాంజనేయులు వెల్లడించారు. ఈ మధ్యాహ్నం కేసు పురోగతిని మీడియాకు వివరించిన ఆయన, ఆమెను విచారిస్తున్నామని, మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశముందని అన్నారు. ఈ కేసును నీరుగార్చేందుకు తమపై ఒత్తిళ్లు వస్తున్నాయని వచ్చిన వార్తలు అవాస్తవమని, ఉదంతంపై దర్యాప్తును ముమ్మరంగా జరుపుతున్నామని ఆయన వివరించారు. కాగా, ఇంటినుంచి పారిపోయిన ఓ యువతి రాసిన లేఖతో సల్మా ఉదంతం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.