: ఆర్జేడీ-జేడీ(యూ) కూటమి సీఎం అభ్యర్థిగా నితీష్ కుమార్

వచ్చే ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రణాళిక, సీఎం అభ్యర్థి విషయంలో 'జనతా పరివార్' కూటమి ముందుగానే వ్యూహ రచన చేస్తోంది. ఈ నేపథ్యంలో తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రస్తుత బీహార్ సీఎం నితీష్ కుమార్ పేరును ఖరారు చేసింది. పాట్నాలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సమక్షంలో సమాజ్ వాదీ పార్టీ అధినేత, పరివార్ కు అధ్యక్షుడైన ములాయం సింగ్ యాదవ్ ప్రకటించారు. "బీజేపీని ఓడించేందుకే మేమంతా ఏకతాటిపైకి వచ్చాం. నితీష్ తో మాకెలాంటి విభేదాలు లేవు. నేను ఎన్నికల్లో పోటీ చేయలేను కదా, అలాంటప్పుడు నేను ముఖ్యమంత్రి అభ్యర్థినే కాజాలను" అని ప్రెస్ కాన్ఫరెన్స్ లో లాలూ తెలిపారు. ఈ ప్రకటనకు ముందు నితీష్ మీడియాతో మాట్లాడుతూ, ఆర్జేడీ, జనతాదళ్ (యునైటెడ్), జేడీ (యూ), కాంగ్రెస్ లు అసెంబ్లీ ఎన్నికల్లో కలసి పోటీచేయనున్నట్టు పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ తమకు మద్దతు తెలుపుతుందని చెప్పారు.

More Telugu News