: అవసరమైతే డబుల్ యాక్షన్ కూ రెడీ... టీమిండియా జట్టు డైరెక్టర్ రవిశాస్త్రి

జట్టుకు అవసరమనిపిస్తే డబుల్ రోల్ కూ రెడి అంటున్నాడు టీమిండియా జట్టు డైరెక్టర్ రవిశాస్త్రి. జట్టుకు డైరెక్టర్ గానే కాక అవసరమైతే హెడ్ కోచ్ గానూ పనిచేస్తానని అతడు తెలిపాడు. టీమిండియాకు సహాయమందించేందుకు ఇప్పటికే ముగ్గురు కోచ్ లు ఉన్నారన్న రవిశాస్త్రి, మరో కోచ్ అవసరం లేదని వ్యాఖ్యానించాడు. అందరూ ఊహించిన దానికంటే కూడా ఎక్కువ సమయమే టీమిండియా డైరెక్టర్ గా కొనసాగుతానని అతడు తెలిపాడు. జట్టుకు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో సలహాలిచ్చేందుకు ముగ్గురు కోచ్ లున్న నేపథ్యంలో మరో కోచ్ అవసరమేముందని ప్రశ్నించిన అతడు, అవసరమైతే తానే హెడ్ కోచ్ గా వ్యవహరిస్తానని చెప్పాడు. నిన్న బంగ్లాదేశ్ టూర్ కు వెళుతున్న సందర్భంగా కోల్ కతాలో జరిగిన మీడియా సమావేశంలో రవిశాస్త్రి ఈ వ్యాఖ్యలు చేశాడు.

More Telugu News