: గవర్నర్ వద్ద ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని లేవనెత్తిన చంద్రబాబు

గవర్నర్ నరసింహన్ తో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ ముగిసింది. ఈ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని గవర్నర్ వద్ద చంద్రబాబు లేవనెత్తినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై చంద్రబాబు తన ఆగ్రహాన్ని గవర్నర్ వద్ద వ్యక్తీకరించారంటున్నారు. ఇదే సమయంలో, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలపై గవర్నర్ కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. కేవలం కక్ష సాధింపులో భాగంగానే రేవంత్ ను కేసులో ఇరికించారని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. కడప జిల్లా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు నేరుగా రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలిశారు.

More Telugu News