: ఏపీలో రాజకీయ అనిశ్చితి... కొత్త పార్టీ ఆవశ్యకత ఎంతైనా ఉంది: సబ్బం హరి

కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా ఉంటూనే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కుడిభుజంలా వ్యవహరించిన సబ్సం హరి చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. జగన్ తో విభేదించి వైసీపీకి దూరమైన సబ్బం హరి కొద్దిసేపటి క్రితం విశాఖలో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఏపీలో రాజకీయ అనిశ్చితి నెలకొందని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితిని తొలగించేందుకు మరో కొత్త పార్టీ పుట్టుకురావాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. మరో 8 నెలలు పరిస్థితులను పరిశీలించిన తర్వాత కొత్త పార్టీ కోసం ప్రయత్నిస్తానని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర విభజనకు సహకరించినవారంతా ప్రస్తుతం ముసుగులేసుకుని కొత్త పార్టీల పేరిట ప్రజల్లోకి వస్తున్నారని ఆయన విమర్శించారు.

More Telugu News