: కడప ఎయిర్ పోర్టు ప్రారంభం... కేంద్ర మంత్రులతో కలిసి ప్రారంభించిన ఏసీ సీఎం చంద్రబాబు

కడపలో సరికొత్త హంగులతో ఏర్పాటైన విమానాశ్రయాన్ని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అశోకగజపతి రాజు, నిర్మలా సీతారామన్, సుజనా చౌదరిలతో కలిసి కొద్దిసేపటి క్రితం ఎయిర్ పోర్టును చంద్రబాబు ప్రారంభించారు. నేటి మధ్యాహ్నం ఈ విమానాశ్రయం నుంచి బెంగళూరుకు తొలి విమానం బయలుదేరనుంది. బ్రిటిష్ హయాంలో ఇంధనం నింపుకునేందుకు నిర్మించిన ఈ విమానాశ్రయ అభివృద్ధికి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చర్యలు చేపట్టినా, ఆయన అకాల మృతితో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. తాజాగా ఏడాది క్రితం సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు విమానాశ్రయ పునరుద్ధరణ పనులను వేగవంతం చేసి ఏడాదిలోనే పూర్తి చేయించారు.

More Telugu News