: వెన్నుపోటు పొడిచినవారే పదవుల కోసం వేరే పార్టీల్లో చేరుతున్నారు: సబ్బం హరి

కాంగ్రెస్ లో ఉంటూ సమైక్యాంధ్రకు వెన్నుపోటు పొడిచినవారే పదవుల కోసం పార్టీలు మారుతున్నారని మాజీ ఎంపీ సబ్బం హరి ఎద్దేవా చేశారు. బొత్స సత్యనారాయణ వైఎస్సార్సీపీలో చేరడం పట్ల ఆయన మాట్లాడుతూ, ఇప్పుడు విశాఖ ఎమ్మెల్సీ పదవి కోసం పార్టీ మారుతున్నారని మండిపడ్డారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. విశాఖ ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఎన్నికల్లో పోటీ పడేందుకు బొత్స ప్రయత్నిస్తున్నారని, అలాంటి వారిని ఓడిస్తామని ఆయన చెప్పారు. కేంద్రం ఇచ్చిన హామీల అమలుకు పోరాడేందుకు మేధావులు సన్నద్ధమవుతున్నారని, ఇందుకోసం ప్రత్యేక రాజకీయ వేదిక ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నట్టు ఆయన తెలిపారు.

More Telugu News