: ద్రవిడ్ కు అరుదైన గౌరవం

టీమిండియా దిగ్గజం రాహుల్ ద్రవిడ్ కు అరుదైన గౌరవం దక్కింది. భారత్ ఏ, భారత్ అండర్ 19 జట్లకు కోచ్ గా ద్రవిడ్ ను నియమిస్తూ బీసీసీఐ ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత భారత ఏ టీమ్ కోచ్ గా టీమిండియా దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ ను నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. సమకాలీన భారత క్రికెట్ లో దిగ్గజాలుగా పేరొందిన సచిన్, గంగూలీ, ద్రవిడ్, లక్ష్మణ్ లను తగిన విధంగా వినియోగించుకుంటామని బీసీసీఐ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా జగ్ మోహన్ దాల్మియా చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ద్రవిడ్ ను భారత్ అండర్ 19 జట్టు కోచ్ గా నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకోవడం విశేషం. రాజస్థాన్ రాయల్స్ జట్టు కోచ్ గా అద్భుతమైన పనితీరు కనబర్చిన ద్రవిడ్ ను టీమిండియా కోచ్ గా నియమించాలని పలువురు వ్యాఖ్యానించిన నేపథ్యంలో భారత ఏ, భారత్ అండర్ 19 జట్లకు కోచ్ గా బీసీసీఐ నియమించడంతో సచిన్, గంగూలీ, లక్ష్మణ్ ను ఎలా వినియోగించుకోనుందనే ఉత్కంఠ రేగుతోంది.

More Telugu News