: సినీ నటి ఆర్తీ అగర్వాల్ కన్నుమూత!

ప్రముఖ సినీ నటి ఆర్తీ అగర్వాల్ అమెరికాలోని న్యూజెర్సీలో కన్ను మూసింది. తెలుగునాట అగ్రహీరోలందరి సరసన నటించిన ఆర్తీ అగర్వాల్ టాప్ హీరోయిన్ గా స్థాయికి ఎదిగింది. స్థూల కాయం, శ్వాస సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న ఆర్తీ అగర్వాల్ న్యూజెర్సీలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో లైపోసక్షన్ చికిత్స చేయించుకుంది. అది వికటించడంతో ఆమె గుండెపోటుతో కన్నుమూసింది. ఐదేళ్లపాటు తెలుగు సినీ రంగంలో అగ్రపథాన పయనించిన ఆర్తీ, తదనంతర కాలంలో అవకాశాల్లేక డిప్రెషన్ లోకి వెళ్లింది. సినిమాలు కనుమరుగుకావడంతో అమెరికా వెళ్లిపోయిన ఆర్తీ అగర్వాల్ ఇప్పుడిలా ప్రపంచానికే శాశ్వతంగా దూరమైంది.

More Telugu News