: జగన్ చేసింది సమరదీక్ష కాదు శ్మశాన దీక్ష: ఎమ్మెల్యే యరపతినేని
ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మంగళగిరిలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన సమరదీక్షపై టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. ఆయన చేసింది సమరదీక్ష కాదని, శ్మశాన దీక్ష అని వ్యాఖ్యానించారు. రౌడీలు, దొంగలు, దోపిడీదారులే ప్రజలను నిద్రపోనివ్వరని, ఆ కోణంలోనే చంద్రబాబుకు నిద్ర లేకుండా చేస్తానని జగన్ అంటున్నారని అన్నారు. జైళ్లు, కోర్టుల చుట్టూ తిరిగే జగన్ లాంటి నేత ప్రతిపక్ష నేతగా ఉండటం ఏపీ ప్రజల దురదృష్టకరమని గుంటూరులో విమర్శించారు. జగన్, కేసీఆర్ లు గతేడాది ఎన్నికల్లో కుదుర్చుకున్న రహస్య ఒప్పందం తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బహిర్గతమైందని యరపతినేని ఆరోపించారు.