: భాగ్యనగరాన్ని ముంచెత్తిన వర్షం... కూలిన చెట్లు, హోర్డింగులు
భాగ్యనగరి హైదరాబాదును నిన్న రాత్రి వర్షం ముంచెత్తింది. రాత్రి 9 గంటల సమయంలో మొదలైన వాన, పొద్దుపోయేదాకా కురుస్తూనే ఉంది. 4.3 సెంటీమీటర్లుగా నమోదైన వర్షపాతంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఈదురు గాలులకు నగరంలోని పలు ప్రాంతాల్లోని చెట్లు, హోర్డింగులు కూలిపోయాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో నగరంలోని కొన్ని ప్రాంతాలు రాత్రంతా చీకటిలోనే ఉండిపోయాయి.