: ప్రొడ్యూసర్ గా టెన్షన్ ఫీలవకుండా చేసిన సినిమా ఇదే!: సి.కల్యాణ్

'జ్యోతిలక్ష్మీ' ఆడియో వేడుకలో చిత్ర నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ... ప్రొడ్యూసర్ గా టెన్షన్ ఫీలవకుండా చేసిన సినిమా ఇదేనని చెప్పుకొచ్చారు. అందుకు టీం వర్క్ ప్రధాన కారణమని, ముఖ్యంగా, పూరీ జగన్నాథ్ అందించిన సహకారం మరువలేనిదని అన్నారు. సహ నిర్మాతగా చార్మీ ఎంతో సహకరించిందని తెలిపారు. నిర్మాతగా అనుభవం లేకున్నా, ఆమె తనకు స్థయిర్యాన్నిచ్చిందని వివరించారు. తనకే కాకుండా యూనిట్ అంతటికీ చార్మి ఎనర్జీ అందించిందని అన్నారు. భాస్కరభట్ల అసాధారణ రీతిలో లిరిక్స్ రాశాడని, సునీల్ మంచి సంగీతం అందించాడని కొనియాడారు.

More Telugu News