: తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన పగటి ఉష్ణోగ్రతలు... కేరళ తీరాన్ని తాకనున్న రుతుపవనాలు
తాజాగా కురిసిన చిన్నపాటి జల్లులతో తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణల్లో పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. దీంతో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు రేపు కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకనున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో నాలుగైదు రోజుల్లో రాయలసీమలో రుతుపవనాలు ప్రవేశిస్తాయని ఆ శాఖ అధికారులు తెలిపారు. లక్షద్వీప్, కేరళలో మరో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుందని, తెలంగాణ, దక్షిణకోస్తా మీదుగా ఈ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. కోస్తా, రాయలసీమ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.