: బ్రిటీష్ గాయని సూపర్ రికార్డు

బ్రిటీష్ పాప్ సింగర్ 'ఫాక్సెస్' గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది. వేర్వేరు నగరాల్లో, 12 గంటల వ్యవధిలో అత్యధిక కచేరీలు చేసిన గాయనిగా అవతరించింది. ఈ 26 ఏళ్ల అందాలభామ అసలు పేరు లూయిసా రోజ్ అలెన్. సంగీత ప్రపంచానికి 'ఫాక్సెస్' గా సుపరిచితురాలు. క్యాన్సర్ బాధితుల కోసం నిధులు సేకరించే నిమిత్తం ఆమె అలుపెరగకుండా ఏడు కచేరీలు నిర్వహించింది. తొలుత సౌతాంప్టన్ యూనివర్శిటీ విద్యార్థులను అలరించిన 'ఫాక్సెస్', అనంతరం, బ్రైటన్, గిల్డ్ ఫర్డ్, రీడింగ్, ఆక్స్ ఫర్డ్, హై వికోంబ్, లండన్ లో కచేరీలు నిర్వహించింది. రికార్డు నెలకొల్పిన అనంతరం ఆమె మాట్లాడుతూ... రికార్డు నమోదు చేయడం అద్భుతంగా అనిపిస్తోందని పేర్కొంది. తన సిట్రోయిన్ సి1 కారులో ఓ నగరం నుంచి మరో నగరానికి వెంటవెంటనే ప్రయాణించడం వింత అనుభవమని తెలిపింది. కాగా, అమ్మడు ప్రతి వేదికపైనా 15 నిమిషాలకు తక్కువ కాకుండా ప్రదర్శన ఇచ్చింది. 'యూత్', 'గ్లోరియస్', 'లెట్ గో ఫర్ టునైట్' వంటి హిట్ గీతాలతో అభిమానులను ఉర్రూతలూగించిందీ 'గ్రామీ' విజేత.

More Telugu News