: టీఆర్ఎస్ తో కలసి జగన్ కుట్రలకు పాల్పడుతున్నారు: చంద్రబాబు
వైకాపా అధినేత జగన్ పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి ఆయన తీవ్ర అవరోధంగా మారారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ తో చేతులు కలిపి కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు జగన్ మద్దతు ఇవ్వడమే దీనికి ఉదాహరణ అని అన్నారు. ఈరోజు అనంతపురం పర్యటనకు వెళ్లేముందు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. జగన్, కేసీఆర్ దిష్టి బొమ్మలను దగ్ధం చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.