: కొడుకుతో కలసి ఇంటర్ పరీక్షలు రాసిన తల్లికి ఫస్ట్ క్లాస్!

తన కొడుకుతో కలసి ఇంటర్ పరీక్షలు రాసిన ఓ తల్లి ఫస్ట్ క్లాస్ లో పాసైన ఘటన అస్సాం రాష్ట్రంలోని దిబ్రూగఢ్ జిల్లాలో జరిగింది. ఈ ప్రాంతానికి చెందిన నయనమోని బెజబార్వా (37), తన కుమారుడు అంకుర్ (17) తో కలిసి ఈ సంవత్సరం నిర్వహించిన 12వ తరగతి పరీక్షలకు హాజరైంది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఫలితాల్లో ఆమెకు 69.8 శాతం మార్కులు వచ్చాయి. అయితే, ఆమె తనయుడు అంకుర్ మాత్రం అతి కష్టం మీద పాస్ మార్కులు సంపాదించుకోగలిగాడు. నయనమోనికి 18 ఏళ్ల వయసులోనే చదువు మాన్పించి పెళ్లి చేశారు ఆమె తల్లిదండ్రులు. గత సంవత్సరం రాసిన ఫస్టియర్ పరీక్షల్లో సైతం ఆమెకు 60 శాతం మార్కులు వచ్చాయట. ఆమెకున్న పట్టుదలే ఈ ఘనతను తెచ్చిపెట్టిందని, ఆమె రేయింబవళ్లు పడ్డ కష్టానికి ఫలితం దక్కిందని స్థానిక బాలికల పాఠశాల ప్రిన్సిపాల్ సొంటోరా గొగోయ్ వ్యాఖ్యానించారు. అయితే, తన కొడుకుకు వచ్చిన మార్కులు చూసి నయనమోని మాత్రం ఆనందంగా లేదట.

More Telugu News