: ఆ ముగ్గురి పేర్లతో పాటు ద్రవిడ్ పేరెందుకు లేదంటే...!

సమకాలీన క్రికెట్ ప్రపంచంలో, అందునా భారత్ పేరు చెబితే వినిపించే పేర్లలో రాహుల్ ద్రవిడ్ పేరు తప్పనిసరిగా ఉండి తీరుతుందనడంలో సందేహం లేదు. అటువంటిది, ఇటీవల బీసీసీఐ సచిన్, గంగూలీ, లక్ష్మణ్ లతో కూడిన క్రికెట్ సలహా మండలిని నియమించిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో వారికేమాత్రం తీసిపోని ద్రవిడ్ పేరు లేకపోవడం క్రికెట్ అభిమానులకు వెలితిగా కనిపించింది. ఎంతో సహనశీలిగా, అనుభవజ్ఞుడిగా, జట్టు కెప్టెన్ గా పనిచేసిన ద్రవిడ్ ను బోర్డు విస్మరించిందని విమర్శలూ వెల్లువెత్తాయి. తొలుత లక్ష్మణ్ పేరు స్థానంలో ద్రవిడ్ ను అనుకున్నప్పటికీ, గంగూలీతో కలసి పనిచేయడం ఇష్టం లేకనే తన పేరు వద్దని ద్రవిడ్ వెల్లడించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఆయన్ను కోచ్ పదవికి ఎంపిక చేసే అవకాశాలు ఉన్నందునే సలహా కమిటీలో తీసుకోలేదన్న వార్తలూ వచ్చాయి. వీటిల్లో ఏది నిజమో కాలమే సమాధానం చెప్పాలి.

More Telugu News