: ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు...మిగతా సమయాల్లో అభివృద్ధిపైనే దృష్టి: యనమల
ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు మాట్లాడాలని, మిగిలిన సమయాల్లో అభివృద్ధిపై మాత్రమే దృష్టి సారించాలని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఏపీ నవ నిర్మాణ దీక్షల సందర్భంగా విశాఖపట్నంలో జరిగిన దీక్షలో పాల్గొన్న ఆయన కొద్దిసేపటి క్రితం ఈ మేరకు వ్యాఖ్యానించారు. రాష్ట్రాభివృద్ధికి అన్ని రాజకీయ పార్టీలు విభేదాలను పక్కనబెట్టి ప్రభుత్వానికి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.