: బాబుపై కేసు పెట్టేందుకు ఈ ఆధారాలు చాలవా?: గవర్నరును కలిసిన అనంతరం జగన్

ఇంత పకడ్బందీగా వీడియో, ఆడియో సాక్ష్యాధారాలు లభించినా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై కేసు ఎందుకు పెట్టడం లేదని వైకాపా నేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఈ ఉదయం గవర్నరు నరసింహన్ ను కలిసి చంద్రబాబుపై కేసు పెట్టాలని విజ్ఞప్తి చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి నోటి వెంట చంద్రబాబు పేరు వినిపించిందని, ఆయన్ను కలిపిస్తానని స్టీఫెన్ సన్ తో చెప్పాడని, రూ. 2.5 కోట్ల వరకూ తాను సర్దగలనని, రూ. 5 కోట్లు కావాలంటే తమ బాస్ పరిధిలోనిదేనని అంత స్పష్టంగా చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ, కేసు నమోదు చేసేందుకు ఈ ఆధారాలు చాలవా? అని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు ప్రమేయంతోనే 'ఓటుకు నోటు' లావాదేవీ జరిగిందని, తక్షణమే ఆయనపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.

More Telugu News