: పెరిగిన సబ్సిడీ రహిత గ్యాస్ సిలిండర్ ధర

అంతర్జాతీయ చమురు మార్కెట్లో ధరల మార్పు మేరకు ఇండియాలో విమాన ఇంధన ధరలతో పాటు సబ్సిడీ రహిత గ్యాస్ సిలిండర్ ధరను స్వల్పంగా పెంచుతున్నట్టు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ప్రకటించాయి. సబ్సిడీ లేని కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ. 10.50, విమాన ఇంధన ధరను 7.5 శాతం పెంచుతున్నామని, ఈ మార్పు తక్షణం అమల్లోకి వచ్చినట్టని వెల్లడించాయి. కొత్త ధరల ప్రకారం ఢిల్లీలో విమాన ఇంధన ధర కిలో లీటరుకు రూ. 3,744.08 పెరిగి రూ. 53,353.92కు చేరుకుంది. నిన్నటివరకూ ఢిల్లీలో రూ. 616గా ఉన్న సిలిండర్ ధర నేటి నుంచి రూ. 626.50కు పెరిగింది. దేశంలో సబ్సిడీతో లభించే గ్యాస్ ను కొనుగోలు చేసే వారు 12 సిలిండర్ల కన్నా అధికంగా కొనుగోలు చేస్తే ఇదే ధర వర్తిస్తుందని చమురు మార్కెటింగ్ సంస్థలు స్పష్టం చేశాయి. ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలు ప్రతి 15 రోజులకు ఒకసారి 'పెట్రో' ఉత్పత్తుల ధరలను సవరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ దఫా పెట్రోలు, డీజిల్ ధరలు మాత్రం మారలేదు.

More Telugu News