: జూలైలో 25 వేల ఉద్యోగాలు భర్తీ: తెలంగాణ సీఎం కేసీఆర్

జూలైలో 25 వేల సర్కారీ కొలువుల భర్తీకి చర్యలు చేపట్టనున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా సికింద్రాబాదు పరేడ్ గ్రౌండ్స్ లో కొద్దిసేపటి క్రితం ఆయన రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఉద్యోగాల భర్తీలో నెలకొన్న ప్రతిష్టంభనకు తెర దించుతూ జూలైలో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. అంతేకాక వచ్చే నెల నుంచే కాంట్రాక్టు కార్మికుల సర్వీసులను క్రమబద్ధీకరణకు శ్రీకారం చుడతామని తెలిపారు. విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధి సాధించామన్న ఆయన, మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత తన ప్రభుత్వానికే దక్కిందన్నారు.

More Telugu News