: అంబేద్కర్ జన్మస్థలానికి రాహుల్

అణగారిన వర్గాలకు దగ్గరయ్యేందుకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన నేడు బీఆర్ అంబేద్కర్ జన్మస్థలమైన మధ్యప్రదేశ్ లోని ఎంహౌ పట్టణాన్ని సందర్శించనున్నారు. దళితుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన అంబేద్కర్ జయంతిని కాంగ్రెస్ వచ్చే ఏడాది ఘనంగా నిర్వహించాలనుకుంటోంది. ఈలోగా, ఒకప్పుడు తమకు ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్న దళితులకు దగ్గరవ్వాలన్నది రాహుల్ యోచనగా కనిపిస్తోంది. ఈ మధ్యాహ్నం ఇండోర్ కు చేరుకోనున్న రాహుల్ అక్కడి నుంచి మోవు వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేస్తారు. అనంతరం, భారీ బహిరంగ సభలో పాల్గొంటారని ఏఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి. సాయంత్రం ఢిల్లీ బయలుదేేరే ముందు దళితనేతలు, ఉద్యమకారులతో మాట్లాడతారు.

More Telugu News