: బెజవాడలో చంద్రబాబు నవ నిర్మాణ దీక్ష... నగరంలో భారీ ర్యాలీకి ఏర్పాట్లు

ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మరికాసేపట్లో నవ నిర్మాణ దీక్ష చేపట్టనున్నారు. విజయవాడ కేంద్రంగా జరగనున్న ఈ దీక్షకు ముందు నగరంలోని స్టెల్లా కళాశాల నుంచి బెంజి సర్కిల్ వరకూ చంద్రబాబు నేతృత్వంలో భారీ ర్యాలీ జరగనుంది. నవ నిర్మాణ దీక్షా వేదిక నుంచి నేటి ఉదయం 9.30 గంటలకు చంద్రబాబు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. మధ్యాహ్నం దాకా దీక్ష చేయనున్న చంద్రబాబు, 3.30 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టులో నూతన టెర్మినల్ ను ప్రారంభిస్తారు. ఈ క్రమంలో, కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు గన్నవరం ఎయిర్ పోర్ట్ చేరుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు మంత్రులు, టీడీపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు.

More Telugu News