: కేసీఆర్ ను కలిసి గెలుపు ఆనందాన్ని పంచుకున్న ఎమ్మెల్సీలు

తెలంగాణలో శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పర్వం ముగిసింది. టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన ఐదుగురూ గెలిచారు. అటు, కాంగ్రెస్ తరపున బరిలో దిగిన ఆకుల లలిత కూడా నెగ్గారు. టీఆర్ఎస్ అభ్యర్థులు కడియం శ్రీహరి, నేతి విద్యాసాగర్ రావు, తుమ్మల నాగేశ్వరరావు, యాదవరెడ్డి, బి.వెంకటేశ్వర్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయభేరి మోగించారు. ఎన్నికల ఫలితాలు వెల్లడించిన అనంతరం టీఆర్ఎస్ నూతన ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును ఆయన అధికారిక నివాసంలో కలిశారు. తమ ఆనందాన్ని ఆయనతో పంచుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు తెలిపారు.

More Telugu News