: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పవర్ పంచ్... ఐదు స్థానాలూ కైవసం
తెలంగాణలో ఉత్కంఠ రేకెత్తించిన ఎమ్మెల్సీ (శాసనసభ్యుల కోటా) ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. పోటీ చేసిన ఐదు స్థానాలనూ కైవసం చేసుకుని అధికార పార్టీ సత్తా చాటింది. టీఆర్ఎస్ తరపున పోటీచేసిన కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, నేతి విద్యాసాగర్ రావు, యాదవరెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు గెలుపొందారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఆకుల లలిత కూడా విజయం సాధించారు. మొత్తం ఆరు స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. కౌంటింగ్ కొద్దిసేపటి క్రితం పూర్తయింది. ఐదు ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. ఓ సభ్యుడు 'నోటా' ఉపయోగించుకున్నారు.