: రేవంత్ చెప్పిన 'బాస్' ఎవరు?: రాజకీయ వర్గాల్లో చర్చ

తెలంగాణ తెదేపా నేత రేవంత్ రెడ్డి, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ మధ్య జరిగిన సంభాషణల్లో రేవంత్ ప్రస్తావించిన 'బాస్' ఎవరని రాజకీయ వర్గాల్లో ఎడతెగని చర్చ మొదలైంది. రేవంత్, స్టీఫెన్ ల మధ్య జరిగిన సంభాషణల వీడియోను ఏసీబీ పోలీసులు మీడియాకు విడుదల చేశారు. ఇందులో, బాస్ కు విషయం తెలుసునని, బాస్ తమనే నమ్మారని రేవంత్ చెబుతుండడం వినిపిస్తోంది. ఒకసారి వచ్చి బాస్ ను కలవాలని కూడా రేవంత్ కోరారు. సోమవారం రాత్రి 9 గంటల కల్లా మిగతా డబ్బంతా ఇచ్చేస్తామని, తమకు ఓటేసినందు వల్ల పదవి పోతే, ఆంధ్రప్రదేశ్ లో పోస్టు ఇప్పిస్తామని ఆయన నమ్మబలికారు. ఇప్పుడిక ఈ 'బాస్' ఎవరన్న విషయంపై చర్చ మొదలైంది. తెరాస నేతలు మాత్రం విషయం వెనుక చంద్రబాబునాయుడు ఉన్నాడని, తక్షణం ఆయన్ను కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

More Telugu News