: చంద్రబాబు డైరెక్షన్ లో రేవంత్ నటించడం దురదృష్టకరం: కడియం శ్రీహరి
డబ్బుతో రాజకీయాలను నడపడం టీడీపీ అధినేత చంద్రబాబుకు మొదటి నుంచీ అలవాటేనని టీఎస్ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆరోపించారు. వాస్తవంగా ఏం జరిగిందో తనకు కూడా తెలియదని... రేవంత్ రెడ్డి విషయం తాను కూడా టీవీలో చూసే తెలుసుకున్నానని చెప్పారు. చంద్రబాబు డైరెక్షన్ లో రేవంత్ రెడ్డి నటించారని ఆరోపించారు. తెలంగాణలో డబ్బు రాజకీయాలు నడపరాదని సూచించారు. తనకు అడ్డమవుతాడనే అనుమానంతో... ఎర్రబెల్లి దయాకరరావే రేవంత్ రెడ్డికి సంబంధించిన సమాచారం అందించి, అరెస్ట్ చేయించి ఉండవచ్చని కడియం అన్నారు.