: 'జీహాద్' అంటూ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఇలా ప్రవర్తిస్తారట!

ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరాచకాలను కథలు కథలుగా బాధితులు చెబుతున్నారు. ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసుకోవాలి, మతాన్ని విస్తరించాలన్న పిచ్చికోరికతో దారుణాలకు తెగబడుతున్నారు. వీరి బారినపడిన వేలాదిమంది యువతులు సమిధలుగా మారారు. తొమ్మిది నెలలపాటు ఐఎస్ఐఎస్ వద్ద బందీగా ఉన్న ఓ మహిళ ఉగ్రవాదులు జీహాద్ పేరిట చేస్తున్న దురాగతాలను కళ్లకు కట్టింది. ఇరాక్ లోని సింజన్ పట్టణానికి చెందిన యాజీదీ తెగకు చెందిన ఈ 17 ఏళ్ల అమ్మాయిని గతేడాది ఆగస్టులో సోదరితో పాటు కిడ్నాప్ చేశారు. వారిని సిరియాలో ఐఎస్ అధీనంలో ఉన్న రక్కా పట్టణానికి తరలించారు. వారిద్దరితో పాటు పదుల సంఖ్యలో యువతులకు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు కన్యత్వ పరీక్షలు చేయించారట. వారినందరినీ ఓ గదిలోకి తీసుకెళ్లిన ఉగ్రవాదులు వరుసగా నిలబెట్టారట. అక్కడ ఎవరికి నచ్చిన అమ్మాయిని వారు ఎంచుకున్నారట. వారు కోరుకున్నంత అందంగా లేకపోవడంతో ఆ మహిళను, ఆమె సోదరిని, మరో ఇద్దరమ్మాయిలతో కలిసి చెచెన్యాకు చెందిన అల్-రషియా అనే ఐఎస్ ఉగ్రవాదికి అమ్మేశారట. ఆ ఉగ్రవాది ఈ నలుగుర్నీ ప్రతి రోజూ ఉదయం నగ్నంగా నిలబెట్టేవాడట. నలుగురిలో తనకు నచ్చినవారిపై అత్యాచారానికి తెగబడే వాడట. అతని తంతు ముగియగానే అతని అనుచరులు కూడా వారిపై అత్యాచారానికి పాల్పడేవారు. ఆరోగ్యం సహకరించకో, ఇతరత్ర కారణాలతోనో వారికి సహకరించని పక్షంలో వేడినీళ్లను కాళ్లపై పోసి చిత్రహింసలు పెట్టేవారట. తొమ్మిది నెలలు నరకం చూస్తూ బతికిన ఆమె పాలిట కుర్థిష్ సైనికులు దేవుళ్లలా వచ్చారట. ఐఎస్ తీవ్రవాదులను చంపి మహిళలకు విముక్తి కల్పించారట. కాగా, ఆమెపై జరిగిన అత్యాచారాల కారణంగా, ఆమె గర్భందాల్చిందట.

More Telugu News