: 'బాహుబలి' గురించి అనుష్కను 25 నిమిషాల పాటు అడగవచ్చు: రాజమౌళి

దేవసేనను 25 నిమిషాలపాటు 'బాహుబలి' సినిమా గురించి అడగవచ్చని దర్శకుడు రాజమౌళి తెలిపాడు. 'బాహుబలి' టీజర్ ను సరిగ్గా 7:25 నిమిషాలకు దేవసేన (అనుష్క) విడుదల చేస్తుందని ఆయన చెప్పారు. టీజర్ విడుదలకు ముందు ఏడు గంటల నుంచి దేవసేనను సినిమా గురించిన విశేషాలు ట్విట్టర్ వేదికగా అడిగి సమాధానాలు పొందవచ్చని ఆయన ట్వీట్ చేశారు. ఆడియో వేడుక వాయిదా పడడంతో టీజర్ విడుదల చేసి అభిమానులను అలరించాలని రాజమౌళి ప్రయత్నిస్తున్నాడు. 'బాహుబలి' సినిమాలో దేవసేనగా అనుష్క నటిస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News