: జపాన్ లో భూకంపం... ఢిల్లీలో స్వల్ప ప్రకంపనలు

జపాన్ లో భారీ భూకంపం సంభవించింది. ప్రధానంగా రాజధాని టోక్యోలో భవనాలు ఒక నిమిషం పాటు కంపించాయని తెలిసింది. దాంతో ప్రజలు భవనాల నుంచి ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.8గా నమోదైంది. బొనిన్ ఐలాండ్స్ కు 660 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు ఐఎండీ వెల్లడించింది. మరోవైపు ఈక్వెడార్ లోని క్విటో పట్టణం, అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో కూడా భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.8గా నమోదైంది. ఇటు భారత్ లోని ఢిల్లీలో, ఇంకా పలుచోట్ల స్వల్ప ప్రకంపనలు వచ్చినట్టు దేశ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

More Telugu News