: రైళ్లలో స్వల్పంగా పెరగనున్న మొదటి, ఏసీ తరగతుల ఛార్జీలు

రైళ్లలో మొదటి, ఏసీ తరగతుల ఛార్జీలు స్వల్పంగా పెరగనున్నాయి. జూన్ 1 నుంచి ఈ ఛార్జీలు 0.5 శాతం పెరగనున్నాయని తెలిసింది. రైళ్లలో సేవాపన్ను కారణంగా ఈ ఛార్జీలను పెంచుతున్నారు. ఈ చార్జీల పెరుగుదల జూన్ 1 నుంచి కొనుగోలు చేసే టికెట్లకు మాత్రమే వర్తిస్తుంది. ప్రస్తుతం మొదటి, ఏసీ తరగతుల రైలు ఛార్జీలపై 3.708 శాతం సేవా పన్ను విధించబడుతుంది. జూన్ నుంచి సేవాపన్ను 4.2 శాతం పెరగనుందని రైల్వే శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

More Telugu News