: అన్నదాతల ఆత్మహత్యలపై ఆందోళన వ్యక్తం చేసిన అమితాబ్

దేశంలో రైతుల ఆత్మహత్యలు నానాటికీ పెరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ స్పందించారు. అన్నదాతల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. చేతిలో రూ. 20 వేలు, 30 వేలు కూడా లేక... అనేక మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటం ఆవేదన కలిగిస్తోందని తెలిపారు. అందరికీ అన్నం పెట్టే రైతు ఆత్మహత్యలకు పాల్పడటం మంచిది కాదని బిగ్ బీ అన్నారు. రైతులను పట్టించుకోకపోతే, మొత్తం సమాజమే ప్రమాదంలో పడిపోతుందని హెచ్చరించారు.

More Telugu News