: చంద్రబాబుతో భేటీ అయిన కిషన్ రెడ్డి
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా, టీడీపీ కేంద్ర కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు చంద్రబాబుకు కిషన్ రెడ్డి అభినందనలు తెలిపారు. మహానాడు కార్యక్రమం గొప్పగా నిర్వహించారని అన్నారు. అనంతరం, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల అంశంపై వీరు చర్చించారు.