: అవినీతి గురించి చంద్రబాబు మాట్లాడటం బాధగా ఉంది: విజయసాయిరెడ్డి

మహానాడు వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఆరోపణలను ఆ పార్టీ నేతలు తిప్పికొట్టారు. అవినీతి గురించి ప్రశ్నించే ముందు చంద్రబాబు తనను తాను ప్రశ్నించుకోవాలని వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి హితవు పలికారు. అసలు అవినీతి గురించి చంద్రబాబు మాట్లాడటం బాధగా ఉందన్నారు. స్వదేశీ సంపదను హవాలా రూపంలో సింగపూర్ తరలించి అక్కడ హోటళ్లు నిర్మించిన ఘనత ఆయనదేనని ఎద్దేవా చేశారు. కృష్ణాజిల్లా గుడివాడలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని, ఎమ్మెల్సీ అభ్యర్థి జి.ఆదిశేషగిరిరావు (నటుడు కృష్ణ సోదరుడు) సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విజయసాయి మాట్లాడుతూ, అవినీతి ఆస్తులు పంచుతాననడం సంతోషమేనన్నారు. కానీ ముందు తను తరలించిన హవాలా ఆస్తులను రాష్ట్ర ప్రజలకు పంచాలని బాబుకు సూచించారు.

More Telugu News