: కేసీఆర్ కుటుంబం భూములు మింగుతోందంటూ ఉస్మానియాలో ఫ్లెక్సీలు

ఉస్మానియా విశ్వవిద్యాలయ భూములపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనపై విద్యార్థి సంఘాల్లో నిరసన జ్వాలలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్నమొన్నటి వరకు సీఎం దిష్టిబొమ్మలకు శవయాత్రలు నిర్వహించి దహనం చేసిన విద్యార్థులు తాజాగా ఫ్లెక్సీల రూపంలో వారి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాజాగా 'కేసీఆర్ కుటుంబం భూములు మింగుతోంది' అంటూ ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థులు ఫ్లెక్సీ కట్టారు. మరోవైపు ఈ మధ్యాహ్నం ప్రొఫెసర్ కంచె ఐలయ్య, ప్రజాగాయని, టఫ్ అధ్యక్షురాలు విమలక్క విద్యార్థులతో సమావేశమై భూముల వ్యవహారంపై చేబట్టాల్సిన నిరసన కార్యక్రమాలపై చర్చించే అవకాశం ఉంది.

More Telugu News