: రూ.50 తగ్గి... మూడు వారాల కనిష్టానికి చేరిన బంగారం ధర
బంగారం ధర ఈరోజు రూ.50 తగ్గింది. దాంతో పసిడి ధర మూడు వారాల కనిష్టానికి చేరింది. ఈ క్రమంలో 10 గ్రాముల బంగారం ధర రూ.27,225కు చేరింది. డిమాండు తగ్గడం, నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు లేకపోవడం, ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో బంగారం ధర తగ్గిందని మార్కెట్ నిపుణులు తెలిపారు. మరోవైపు వెండి ధర మాత్రం ఈరోజు రూ.210 పెరిగింది. దాంతో కిలో వెండి రూ.38,750 పలుకుతోంది. నాణేల తయారీదారులు కొనుగోళ్లు చేపట్టడంతో వెండి ధరలు పెరిగాయని బులియన్ వర్గాలు చెప్పాయి.