: జపాన్ లో పేలిన అగ్ని పర్వతం... ఎగసి పడుతున్న లావా

జపాన్ కు చెందిన కుచినరబో అనే ద్వీపంలో అగ్ని పర్వతం బద్దలైంది. దీంతో, పెద్ద ఎత్తున లావా, బూడిద ఎగసిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఆ ద్వీపంలోని ప్రజలందరినీ ఖాళీ చేయించాలని వాతావరణ శాఖ సూచించింది. దీంతో, ఆ ద్వీపంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో అధికారులు తలమునకలై ఉన్నారు. ప్రజలను సురక్షితంగా చూసుకునే బాధ్యత తమదే అని జపాన్ ప్రధాని ప్రకటించారు. పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత ప్రజలు తిరిగి వారి నివాసాలకు రావచ్చని ఆయన తెలిపారు.

More Telugu News