: తండ్రీ కొడుకుల పొగడ్తలకే మహానాడు వేదిక: మంత్రి తలసాని

టీడీపీ మహానాడు సందడిపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శలు చేశారు. తండ్రీ కొడుకులు చంద్రబాబు, లోకేష్ ల పరస్పర పొగడ్తల కోసమే మహానాడు వేదిక ఏర్పాటు చేశారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ను అభివృద్ధి చేశానంటున్న చంద్రబాబు తన మొహాన్ని ఒకసారి అద్దంలో చూసుకోవాలని ఎద్దేవా చేశారు. ఇప్పటివరకు ఏపీలో ఎంత ఆదాయం సృష్టించారో చెప్పాలని తలసాని ప్రశ్నించారు. ఏడాది గడచినా చంద్రబాబు హైదరాబాద్ ను వదిలి వెళ్లడం లేదని, తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప టీ.టీడీపీకి ఏమి తెలియదని ఆయన మండిపడ్డారు.

More Telugu News