: నెల్లూరు భూ వివాదంలో నిర్మాత సి.కల్యాణ్
నెల్లూరులోని వక్ఫ్ బోర్డు స్థలాన్ని నిర్మాత సి.కల్యాణ్ ఆక్రమించారంటూ ముస్లిం సంఘాలు ఆరోపిస్తున్నాయి. దానిపై స్పందించిన కల్యాణ్, తాను వక్ఫ్ బోర్డ్ భూములను ఆక్రమించలేదని, తన భూమికి సంబంధించి తన దగ్గర అన్ని ఆధారాలున్నాయని చెప్పారు. కావాలనే మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ఈ విషయంపై వివాదం చేస్తున్నారన్నారు. భూమిలో వాటాల కోసమే వివాదాలు రేపుతున్నారని కల్యాణ్ ఆరోపించారు.