: ఈ ప్రభుత్వాన్ని ఇంకా నాలుగేళ్లు భరించాలా?: రవీంద్రనాథ్ రెడ్డి

తెలుగుదేశం పార్టీ ఏడాది పాలనతోనే ప్రజలంతా విసిగిపోయారని వైకాపా అధినేత జగన్ మేనమామ, ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. రైతు రుణాలు మాఫీ చేస్తామని, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామంటూ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపి... టీడీపీ అధికారంలోకి వచ్చిందని... ఇప్పుడు అదే ప్రజలకు చుక్కలు చూపెడుతోందని మండిపడ్డారు. ఈ ప్రభుత్వాన్ని మరో నాలుగేళ్ల పాటు ప్రజలు మోయాల్సిన పరిస్థితి ఉండటం బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ చేపట్టనున్న 'సమరదీక్ష' పోస్టర్ ను విడుదల చేసిన సందర్భంగా ఆయన పైవ్యాఖ్యలు చేశారు.

More Telugu News