: దేశవ్యాప్తంగా గోమాంసాన్ని నిషేధించలేదు: అమిత్ షా

దేశవ్యాప్తంగా గోమాంసాన్ని నిషేధించినట్టు వస్తున్న వార్తలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఖండించారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగానే ఆయా రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాలని అన్నారు. "బీజేపీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల్లో గోమాంసంపై నిషేధం విధించే ముందు మేము ప్రజల మనోభావాలను గౌరవిస్తాము. దేశవ్యాప్తంగా ఈ నిషేధం ఉంటుందని మేము చెప్పనేలేదు" అని షా మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. కాగా ఇప్పటికే బీజేపీ ప్రభుత్వాలున్న మహారాష్ట్ర, హర్యానాలలో గోమాంసాన్ని నిషేధించారు. అయితే తమ పార్టీ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో నిషేధం విధించాలని తాము ఒత్తిడి తీసుకురామని, ఆ ప్రభుత్వాల నిర్ణయానికే వదిలిపెడతామని అన్నారు. మరోవైపు గోమాంసంపై తాజాగా పార్టీ నేత, కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని షా పేర్కొన్నారు.

More Telugu News