: షారుక్, అమీర్ లకు కృతజ్ఞతలు చెప్పిన సల్మాన్

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న 'భజరంగి భాయిజాన్' సినిమా ఫస్ట్ లుక్ ను షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ లు తమ ట్విట్టర్లలో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందుకుగానూ సల్మాన్ వారిద్దరికీ కృతజ్ఞతలు తెలిపాడు. "'భజరంగి భాయిజాన్' ఫస్ట్ లుక్ విడుదల చేసినందుకు షారుక్, అమీర్ లకు నా ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉన్నాను. వారికి, వారి అభిమానులకు దేవుడు సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా" అని సల్లూ ట్వీట్ చేశాడు. సల్మాన్ సోదరి అర్పితాఖాన్ వివాహ సమయంలో ఒక్కటైన ఖాన్ త్రయం, ఆ తరువాత కూడా తమ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. కారు ప్రమాదం కేసు తీర్పు సమయంలో సల్మాన్ ను గత నెలలో షారుక్, అమీర్ కలిశారు. తాజాగా అతని కొత్త చిత్రం కోసం తమవంతు ప్రచారాన్ని కల్పిస్తూ సహకరిస్తున్నారు.

More Telugu News