: టీఆర్ఎస్ లో నెంబర్-2 ఎవరన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానమిచ్చిన కేటీఆర్

టీఆర్ఎస్ అధినేత, టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాజకీయ వారసుడు ఎవరన్న ప్రశ్నకు మంత్రి కేటీఆర్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. పార్టీలో నెంబర్-2 ఎవరో చెప్పడానికి ఇది ఫుట్ బాల్ ఆట కాదని అన్నారు. కేసీఆర్ ఒక మహా వృక్షమని... ఆయనుంటేనే తామందరం ఉంటామనే విషయాన్ని పార్టీలోని వారందరూ గుర్తుంచుకోవాలని చెప్పారు. ఈ రోజు హైదరాబాదులోని ప్రెస్ క్లబ్ లో జరిగిన 'మీట్ ది ప్రెస్' కార్యక్రమంలో ఆయన ఈ సమాధానం ఇచ్చారు. కేసీఆర్ 61 ఏళ్ల యువకుడని... ఆయన మరో ఇరవై లేదా ముప్పై ఏళ్లు సీఎంగానే ఉండాలనే ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ సాధనే తమకు ప్రథమ లక్ష్యమని... దాన్ని సాధించేశాం గనుక ఇప్పుడున్నదంతా బోనస్ అని అన్నారు.

More Telugu News